సకల సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న విద్యారంగాన్ని కాపాడలేక సమస్యలను గాలికి వదిలేసి, కేంద్రంలో చదువులపై జీ. ఎస్. టిలు, రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల ఫీజుల దోపిడీకి అడ్డుచెప్పకపోగా ప్రైవేట్ యూనివర్సిటీ లను ప్రత్యేక్షంగా తీసుకొచ్చిందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక్షంగా విద్యా వ్యాపారానికి శ్రీకారం చుట్టాయని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ ఎ స్టాలిన్ ఆరోపించారు.
శనివారం నాడు ఉప్పల్ డిపోలోని వ్యాసభట్టు మధుసూదన్ ప్రాంగణం(శ్రీ నారాయణ జూనియర్)లో ఎఐఎస్ఎఫ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా 3వ మహాసభలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ మహాసభల సందర్భంగా ఏఐఎస్ఎఫ్ జెండాను విశిష్ట అతిథిగా విచ్చేసిన ఎఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి బాలమల్లేష్ ఆవిష్కరించారు. అనంతరం జరిగిన ప్రతినిధుల మహాసభలకు అధ్యక్ష వర్గంగా ఎం. డీ ఆన్వర్, కాసోజ్ నాగజ్యోతి, సతీష్ లు వహించారు. ఈ సభలకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఎన్ ఎ స్టాలిన్ మాట్లాడుతూ అందరికీ విద్య పేరుతో కొందరికే (కొనగలిగే వారికే) విద్యను పరిమితం చేసిన ఘనత మన పాలకులదని ఎద్దేవా చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగ సమస్యలు పరిష్కారిస్తామని, ఉచిత విద్యను అందిస్తామని గొప్పలు చెప్పి 2వ సారి గద్దెనెక్కి ఆ హమీలను అమలు చేయడంలో ఏలాంటి చిత్తశుద్ధి లేదనే విషయం మనకు వారి పాలన ద్వారానే అద్దం పడుతుందని, విద్యారంగంలో విదేశి ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్. డి. ఐ)లకు భారత ప్రభుత్వం స్వాగతం పలుకుతున్నదని, పాలకులు ప్రపంచ బ్యాంక్ సలహాలపై ఆదారపడి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు "ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యం" అనే పద్ధతిలో ప్రభుత్వం ప్రైవేట్, కార్పొరేట్ యాజమాన్యాలకు విద్యా వ్యాపారానికి పచ్చజెండా ఊపిందని అన్నారు.
"కేంద్ర ప్రభుత్వం విద్యను కాషాయికరణ వైపు తీసుకెళుతూ విద్యపై జీ. ఎస్. టీ విదిస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం విద్యను వ్యాపారం వైపు తీసుకుపోతూ ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకువచ్చిందని అన్నారు. ప్రభుత్వ విద్యను పూర్తిగా నిర్వీర్యం చేసి పేద, మధ్య తరగతి వర్గాలకు విద్యను పూర్తిగా దూరం చేసే కుట్ర అమలు చేస్తున్నారని దానిలో కేంద్రంలో నూతన జాతీయ విద్యావిధానం-2020 పేరుతో విద్యా కార్పొరేటికరణ, విద్యాకేంద్రీకరణ, కాషాయికరణ చేయాలని చూస్తుందని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యారంగంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించకుండా కొత్త సమస్యలను సృష్టిస్తున్నారని ఆరోపించారు. విద్యాసంస్థలు ప్రారంభమై 2 నెలలు గడుస్తున్నా ప్రభుత్వ పాఠశాలకు పూర్తి స్థాయిలో పాఠ్యపుస్తకాలు, యూనిఫామ్ లు ఇంకా అందకా విద్యాబోధన కుంటిపడిపోతుందని అన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల ముక్కు పిండి ఇష్టానుసారంగా అడ్డుఅదుపు లేకుండా అధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రభుత్వం చోద్యం చూడడమే కాకుండా ఎలాంటి చర్యలు తీసుకొకపోవడం వెనుక పెద్ద కుట్ర దాగి వుందని అన్నారు.
సమస్యల సుడిగుండంలో ఉన్న బాసర త్రీబుల్ ఐటీ విద్యార్థుల బాధలు తీర్చలేని స్థితిలో నిస్సహాయక స్థితిలో రాష్ట్ర ప్రభుత్వం ఉందని, ఆశ్రమ విద్యాసంస్థల్లో వానపాములతో, బొద్దింకలతో కలుషిత ఆహారం పెడుతూ విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతున్న అధికారులపై చర్యలేందుకు తీసుకొవడం లేదో ప్రభుత్వ చీకటి ఒప్పందం ఏమిటో బహిర్గతం చేయాలని అన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాల్లో గత సంవత్సరం లక్ష పది వేయిల విద్యార్థులు చేరితే ఈ సంవత్సరం నలబైమూడు వేయిలే చేరారంటే జూనియర్ కళాశాల పరిస్థితి ఎట్లా ఉందో అర్ధం చేసుకోవచ్చునని, జూనియర్ కళాశాలలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మధ్యాహ్న భోజన పథకం హామీ ఇంకా అమలు నోచుకోలేదని, విద్యారంగంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 3850 వేయిల రూపాయల స్కాలర్ షిప్స్, ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఉండడంతో విద్యార్థులు అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇకనైనా పాలక వర్గాలు మొద్దు నిద్రను వీడి విద్యారంగంలో నెలకొని ఉన్న సమస్యలను పరిష్కరించాలని, అదేవిధంగా బాసర త్రీబుల్ ఐటీ విద్యార్థుల ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని, ఆశ్రమ పాఠశాలలో నాణ్యమైన ఆహారం పెట్టాలని, పెంచిన బస్ పాస్ చార్జీలను విరమించుకోని ఉచిత బస్ పాస్ లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వం పతనం తప్పదని హెచ్చరించారు.
ఈ సందర్భంగా ఎఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నక్కి బాలమల్లేష్ మాట్లాడుతూ దేశ స్వాతంత్ర్యమే లక్ష్యంగా ఎఐఎస్ఎఫ్ 1936 ఆగస్టు 12న ఆవిర్భావించి స్వాతంత్ర్య పోరాటంలో ఎఐఎస్ఎఫ్ సమరశీల పోరాటాలు నిర్వహించి ఎందరో కార్యకర్తల ప్రాణత్యాగాలు అజరమరమని, స్వాతంత్ర్య అనంతరం విద్యారంగ సమస్యలపై నిరంతరం ఉద్యమాలు నిర్వహిస్తూ 86 సంవత్సరాల సుదీర్ఘ పయనమని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అవలంభిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా విద్యారంగ సమస్యలపై ఏఐఎస్ఎఫ్ అలుపెరగని పోరాటాలు గావించాలని వారు అన్నారు.
ఎఐఎస్ఎఫ్ మాజీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉమ మహేష్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలను పరిష్కరించడంలో పాలకులు విఫలమైయ్యారని దుయ్యబట్టారు. విద్యారంగ సమస్యలు పరిష్కారం కావలంటే పోరాటాలే శరణ్యమని అన్నారు. అందుకు విద్యార్థులు ప్రతీనభునాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా శ్రీ నారాయణ జూనియర్ కళాశాల డైరెక్టర్ మాట్లాడుతూ పాలకవర్గాల పనితీరు విద్యారంగంపై సరిగా పనిచేయడం లేదని, కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడం ద్వారా ప్రైవేట్, బడ్జెట్ విద్యాసంస్థల విద్యాసంస్థల మనుగడ ప్రశ్నర్థాకమయిందని ఆవేదన వ్యక్తంచేశారు.
ఎఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్ మాట్లాడుతూ విద్యారంగ సమస్యలపై సమరశీల పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో ఎఐఎస్ఎఫ్ మాజీ జిల్లా నాయకురాలు జే. లక్ష్మీ, ఎఐఎస్ఎఫ్ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా నాయకులు హరిష్, చిన్నబాబు, వినయ్, రమ్య, శ్రీలేక, సౌంజన్య, తస్లీమా, మౌనిక తదితరులు పాల్గొన్నారు.