నియోజకవర్గంలో రోజురోజుకూ పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా ప్రజలకు కనీస వసతులు కల్పించి ఎల్బీనగర్ ను ఆదర్శవం తంగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి అన్నారు. హస్తినాపురం డివిజన్ పరిధిలోని శ్రీరమణకాలనీ, హనుమాన్ నగర్ కాలనీ, రెడ్డికాలనీలలో కోటి 27 లక్షల రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి శంకుస్థాన చేశారు. ఈ కార్యక్రమం లో నాయకులు ఆందోజు సత్యంచారి. మాజీ కార్పొరేటర్ పద్మానాయక్, గజ్జెల మదుసూధన్ రెడ్డి, వివిధ కాలనీల సంక్షేమ సంఘాల అధ్యక్షులు విజ య్‌కుమార్. విష్ణువర్ధన్‌రెడ్డి, నారగోని శ్రీనివాస్ యాదవ్, డేరింగుల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.