జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేడు (ఆదివారం) బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ చేనేత విభాగం ఆధ్వర్యంలో హయతనగర్ బొమ్మిడి లలిత గార్డెన్స్ వేడుకలు నిర్వహిస్తామని బీజేపీ రంగారెడ్డి జిల్లా అర్బన్ చేనేత విభాగం కన్వీనర్ బొమ్మ రఘురాం నేత పిలుపునిచ్చారు. బీఎన్ రెడ్డి నగర్ లో ఆయన మాట్లాడుతూ. 2015లో ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ఆగస్టు 7ను జాతీయ చేనేత దినోత్సవంగా ప్రకటించారని తెలిపారు.
ఈ వేడుకల్లో ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఈటల రాజేందర్, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట్ స్వామి, రంగారెడ్డి జిల్లా అర్బన్ అధ్యక్షడు సామ రంగారెడ్డితో పాటు జాతీయ, రాష్ట్ర నాయకులు పాల్గొంటారని తెలిపారు. కార్యక్రమం సాయంత్రం 4 గంటలకు ప్రారంభమవు తుందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు యాదగిరి, ఆరుట్ల సురేష్ కుమార్. రావిరాల సంధ్యరాణి, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.