తెలుగు రాష్ట్రాల్లో మళ్ళీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని 24 గంటల్లో ఒడిశా తీరానికి సమీపంలో అది కదలనుందని, దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. వర్షాలు పడే సమయంలో గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని ఆమె వివరించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.