తెలంగాణలోని మెదక్ జిల్లా దేవులపల్లి గ్రామానికి చెందిన రైతు శ్రీశైలం ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడు. తమకు జీవనాధారమైన ఐదెకరాల భూమిని ప్రకృతివనం పేరుతో సర్పంచి, అధికారులు లాక్కున్నారని వాపోయాడు. సెల్ఫీ వీడియో తీసి, పురుగుల మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. కొడుకు మృతిని తట్టుకోలేక అతడి తల్లి కూడా పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది.