ఉప్పల్ సర్కిల్ పరిధిలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. గత కొద్ది రోజులుగా తగ్గుముఖం పట్టిన కరోనా మహామ్మారి తిరిగి తీవ్ర రూపం దాల్చుతుంది. ఉప్పల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో శనివారం 108 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, ఒకరికి పాజిటివ్ నిర్ధారించినట్లు ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డా. సౌందర్యలత, గొంగడయ్య తెలిపారు. రామంతాపూర్ వెంకట్ రెడ్డినగర్లోని ఆరోగ్య కేంద్రంలో శనివారం 42 మందికి పరీక్షలు చేయగా, వీరిలో ముగ్గురికి పాజిటివ్ గా నిర్ధారించిన ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి డా. రవీనా, నరసింహా తెలిపారు. ప్రజలు కరోనా నిబంధనలు పాటించాలని సూచించారు.