హత్యయత్నం నుంచి తప్పించుకొన్న ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి టీఆర్ఎస్ నేతల పరామర్శాలు కొనసాగుతున్నాయి. తాజాగా హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఇంటికి మంత్రి హరీశ్ రావు వెళ్లారు. హత్యాయత్నం గురించి అడిగి తెలుసుకున్నారు. మంత్రి గంగుల కమలాకర్, ఎమ్మెల్యేలు జనార్దన్ రెడ్డి, క్రాంతి కిరణ్, ఎర్రోళ్ల శ్రీనివాస్ జీవన్ రెడ్డి నివాసానికెళ్లారు. హత్యాహత్నాన్ని ఖండించారు. జీవన్ రెడ్డిని పరామర్శించారు. డాక్టర్స్ అసోసియేషన్ సభ్యులు కూడా జీవన్ రెడ్డిపై హత్యాయత్నాన్ని ఖండించారు. కేదారేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు మంగి రాములు మహరాజ్ జీవన్ రెడ్డి ఇంటికి వచ్చి పరామర్శించారు. శివుడి ఆశీస్సుల వల్ల ప్రాణ గండం తప్పిందన్నారు. జీవన్ రెడ్డికి ధైర్యం చెప్పారు.
అంతకుముందు.. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జీవన్ రెడ్డి ఇంటికి వెళ్లారు. ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకున్నారు. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసన సభాపతి శ్రీ పోచారం శ్రీనివాస రెడ్డి, ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి, నరసింహచార్యులు, ఆకుల లలిత, గెల్లు శ్రీనివాస్ యాదవ్ జీవన్ రెడ్డిని పరామర్శించారు. హత్యాయత్నాన్ని ఖండించారు. జీవన్ రెడ్డి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.