రాజకీయాలకతీతంగా వినాయక నవరాత్రి ఉత్స వాలు చేసుకోవాలని భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి పిలుపునిచ్చింది. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా గణేశ్ నవరాత్రి ఉత్సవాలను ఆగస్టు 31 నుంచి సెప్టెంబరు 9 వరకు వినూత్నంగా జరపాలని నిర్ణయించినట్లు ప్రకటించింది. హైదరాబాద్, సికింద్రాబాద్ జైన్ సమాజ్, గుజరాతి ప్రగతి సమాజ్, కచ్ కడ్వా పాటీదార్ సమాజ్ సంస్థల ప్రతి నిధులతో నిర్వహించిన సన్నాహక సమావేశంలో భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి భగవంతారావు, కార్యదర్శి జస్మత్‌పటేల్ మాట్లాడారు. ప్రతినిధులు సతీశ్ జాగిర్దార్, ముఖేశ్ చౌహాన్, ఆర్కే జైన్ పాల్గొన్నారు.