కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి నిజాంపేట్ భారతదేశం స్వతంత్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపుమేరకు "ఆజాది కా అమృత్ మహోత్సవ్ లో భాగంగా ఆగస్టు 13 నుంచి 15 వరకు ప్రతి ఇంటిపై మూడు రోజులపాటు జాతీయ జెండా ఎగురవేయాలని నినాదంతో నిజాంపేట్ మున్సిపల్ బిజెపి అధ్యక్షులు ఆకుల సతీష్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన తిరంగా యాత్రకు మాజీ ఎమ్మెల్యే, బీజేపీ రాష్ట్ర నాయకులు కూన శ్రీశైలం గౌడ్ , రాష్ట్ర మాజీ ఉపాధ్యక్షులు మల్లారెడ్డి ముఖ్య అతిథిలుగా హాజరయ్యారు.
ప్రగతి నగర్లో ఇంకాసెంటర్లో తిరంగా యాత్ర బైక్ ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా బిజెపి నాయకులు మాట్లాడుతూ ప్రధానమంత్రి మోడీ పిలుపు మేరకు కార్పొరేషన్ పరిధిలో ప్రతి పౌరుడు ఇంటిపై ఆగస్టు 13 నుంచి 15 వరకు మూడు రోజులపాటు జాతీయ జెండా ఎగురవేసి దేశభక్తిని చాటాలని పిలుపునివ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు మహిళా మోర్చా రాష్ట్ర ప్రముఖ అమరేశ్వరి, జిల్లా ఓ బి సి మోర్చా కార్యవర్గ సభ్యు కాశి, ప్రధాన కార్యదర్శులు గొల్ల కృష్ణ, నరేంద్ర , బిక్షపతి యాదవ్ ఉపాధ్యక్షులు కాసాని నర్సింహులు, డాక్టర్ శ్రీనివాస్ , సుహాసిని శక్తి, కార్యదర్శులు అరుణ్ రావు, సత్యనారాయణ, ప్రసాద్ , ఎస్టి మోర్చా అధ్యక్షులు అశోక్ నాయక్, నరేష్ గుప్తా, శివ కుమార్ గౌడ్ ఎస్సీ మోర్చా అధ్యక్షులు రాము ఓబీసీ మోర్చా అధ్యక్షులు మదన్ గౌడ్ మహిళా మోర్చా అధ్యక్షురాలు నవ్య , సీత, రజిని, ట్రేడర్ సెల్ ఈశ్వర్ రెడ్డి పాల్గొన్నారు.