జడ్చర్ల మండల వ్యాప్తంగా ఆదివారం మోస్తరు వర్షం కురిసింది. మండలంలో 12మి. మీ. వర్షపాతం నమోదైంది. కొన్ని రోజులుగా భారీ నుంచి మోస్తరు వాన కురుస్తుండడంతో చెరువులు, కుంటల్లోకి నీరు వచ్చి చేరుతున్నది. అలాగే దుందుభీవాగు పరవళ్లు తొక్కుతున్నది. బోరుబావులు, చెరువుల కింద వరిసాగు చేసేందుకు రైతులు కరిగెట్లు చేస్తున్నారు. వర్షాలతో మెట్టపంటలు దెబ్బతింటున్నాయి. వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిస్తే మొక్కజొన్న, జొన్నచేను పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే రేగడి పొలాలు, మరికట్లలో వేసిన మొక్కజొన్న ఎర్రగా మారుతున్నదని రైతులు తెలిపారు.