జిల్లా కేంద్రంలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓముఠాను గద్వాల టౌన్ పోలీసులు పట్టుకున్నారు. గద్వాల్ టౌన్ ఎస్ఐ హరిప్రసాద్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. గద్వాల్ పట్టణం బీరెల్లు రోడ్డులో ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో ఆదివారం గద్వాల్ టౌన్ ఎస్ఐ ఆధ్వర్యంలో పోలీసులు అకస్మికంగా దాడులు నిర్వహించారు. వ్యభిచారం నిర్వహిస్తున్నా నిర్వాహకులు ఓంగోలుకు చెందిన రమాదేవి, విజయవాడకు చెందిన సాంబశివరావుతో పాటు విటులు చెనుగోనిపల్లి గ్రామానికి చెందిన ఎండి ఫరూఖ్, ఎండి సొహెల్ లను అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కు తరలించినట్లు ఎస్ఐ వెల్లడించారు.