తెలంగాణ రాబిన్ హుడ్, ముదిరాజుల ముద్దుబిడ్డ, పేదల పెన్నిధి పండుగ సాయన్న విగ్రహాన్ని సోమవారం తెలంగాణ ఆబ్కారీశాఖ మంత్రి డాక్టర్ వి. శ్రీనివాస్ గౌడ్ సోమవారం ఆవిష్కరించనున్నారు. మహబూబ్నగర్ పట్టణంలోని వీరన్నపేట రైల్వే గేట్ సమీపంలోని పండుగ సాయన్న సమాధి వద్ద విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. పండుగ సాయన్న ప్రఖ్యాత ప్రజానాయకుడు. నిజాం నవాబుల కాలంలో భూస్వాములను, దొరలను, ధనవంతులను ఎదిరించి పేదల పక్షాన నిలిచిన యోధుడు.
ఆయన చరిత్రను నేటికీ సామాన్య ప్రజలు కథలు కథలుగా చెప్పుకొని కీర్తిస్తుంటారు. దీనికి తోడు మహబూబ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ముదిరాజుల ముద్దుబిడ్డగా ఆయన ప్రసిద్ది. ఇక్కడి ముదిరాజ్ సామాజిక వర్గం ఆయనతో ఉన్న సెంటిమెంట్ దృష్ట్యా పండుగ సాయన్న అంశం ఒక రాజకీయ ఎజెండాగా మారింది. గతంలో ఇచ్చిన హామీ మేరకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ పండుగ సాయన్న విగ్రహాన్ని నేడు ప్రతిష్టిస్తున్నారు.