సంగారెడ్డి జిల్లా సిర్గాపూర్ మండల పరిధిలోని సుల్తానాబాద్ నల్లవాగు ప్రాజెక్ట్ లోకి వరద కొనసాగుతోంది. ఎగువ ప్రాంతంలో వర్షాలు కురుస్తున్నందున వాగులు జోరుగా పారుతున్నాయి. ఉజాలంపాడ్, వాంగాదల్, వాసర్ ఊర వాగు, రామ్ తీర్థం ప్రాంతంలోని వాగులన్నీ పొంగిపొర్లి నల్ల వాగు ప్రాజెక్టులో కలుస్తున్నాయి. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 1493 అడుగులకు చేరడంతో అలుగు దిగువకు దుంకుతోంది. ప్రాజెక్టు ఎడమకుడి కాల్వ ద్వారా 100 క్యూసెక్కులు నీటిని వదిలినట్లు అధికారులు చెప్పారు.