నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఎమ్మార్వో కార్యాలయం సమీపంలో ఆదివారం కారు బీభత్సం సృష్టించింది. వేగంగా వెళుతున్న కారు అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న నాలుగు ద్విచక్ర వాహనాలపైకి దూసుకెళ్లింది. సంఘటన సమయంలో కారు వేగం అదుపు చేయలేక రోడ్డు పక్కనే ఉన్న ఓ హోటల్ మెట్ల భాగాన్ని ఢీకొట్టి ఆగింది. ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కారు నడిపిన వ్యక్తి పరారయ్యాడు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ప్రమాద వీడియోలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి.