పోచారం ప్రాజెక్టు లోకి ఎగువ ప్రాంతాలైన గాంధారి, లింగంపేట మండలాల నుంచి 3854 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుందని నీటిపారుదల శాఖ అధికారులు తెలిపారు. ఎగువ ప్రాంతంలో ఆదివారం వర్షాలు కురవడంతో వరద నీరు అధికంగా వస్తుందని చెప్పారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 21. 5 అడుగులు పూర్తిగా నిండి పోయిందని అధికారులు చెప్పారు. ప్రాజెక్టు అలుగు నుంచి 3854 క్యూసెక్కుల వరద నీరు బయటకు వెళ్తోందని పేర్కొన్నారు. ప్రాజెక్టుకు పర్యటకుల సందడి పెరిగింది.