స్నేహమేరా జీవితం. స్నేహమేరా శాశ్వతం దానికి మించింది మరొకటి లేదు అంటూ స్నేహితులు ఒకరినొకరు కలుసుకొని శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆదివారం ప్రపంచ స్నేహితుల దినోత్సవాన్ని పురస్కరించుకొని స్నేహితులు ఏకమయ్యారు. పలు ప్రాంతాలలో వ్యాపార, ఉద్యోగ రీత్యా స్థిరపడిన గత స్మృతులను స్మరించుకుంటూ స్నేహితులు ఒకే వేదికపై కలిసారు.
ఈ సందర్భంగా వారు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని పూర్వ అనుభవాలు పంచుకున్నారు. జీవితంలో స్నేహబంధం అనేది శాశ్వతంగా నిలిచిపోతుందని ఈ సందర్భంగా పలువురు కొనియాడారు. చెడు, మంచికి స్నేహమే దగ్గరవుతుందని గుర్తు చేసుకున్నారు. స్నేహానికి మించిన జీవితం మరొకటి లేదని ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ కార్యక్రమంలో శ్రీకార్ ఆస్పత్రి ప్రముఖ వైద్యులు డాక్టర్ మురళి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, రామేశ్వర్ పల్లి ఎంపీటీసీ సభ్యులు మద్ది చంద్రకాంత్‌రెడ్డి, ప్రవాస భారతీయుడు చిట్టెడి సుధాకర్ రెడ్డి, ప్రముఖ వ్యాపారులు ముద్దసాని రాజు, నరేష్, సాఫ్ట్వేర్ ఇంజనీర్ శ్రీధర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు అంకం రాజు, డాక్టర్ దయాకర్ రెడ్డి, గంగారెడ్డి పాల్గొన్నారు.