తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డిని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం కలవనున్నారు. తన రాజీనామా లేఖను స్పీకర్‌కు అందజేసి, దానిని ఆమోదించుకోనున్నట్లు వెల్లడించారు. కొన్ని రోజులుగా స్పీకర్‌ను కలిసేందుకు ప్రయత్నించగా, ఆయన అందుబాటులో లేరని తెలిసిందన్నారు. సోమవారం స్పీకర్‌ను నేరుగా కలిసి రాజీనామా లేఖ ఇస్తానని, లేకుండా అసెంబ్లీ సెక్రటరీకి ఇస్తానని చెప్పారు.