సూర్యాపేట జిల్లా కేంద్రంలోని స్థానిక మినీ ట్యాంక్ బండ్ సోమవారం సద్దలచెరువులో మృతదేహం కలకలం సృష్టించింది. స్థానికులు మృతదేహాన్ని బయటకు తీశారు. మృతుడు సూర్యాపేట పట్టణానికి చెందిన మోర సైదులు 25 సంవత్సరాలు గా స్థానికులు గుర్తించారు. సూర్యాపేట పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉన్నది. పట్టణ పోలీసులు సమగ్ర విచారణ చేపడుతున్నారు. సోమవారం ఒకరోజే సద్దలచెరువు మినీ ట్యాంక్ బండ్ వద్ద రెండు మృతదేహాలు లభ్యం కావడంతో స్థానిక ప్రజలు భయాందోళన చేయుచున్నారు.