కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక ఖాయమైంది. అయితే, త్వరలో జరగబోయే ఈ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి బరిలో ఉంటారని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ చెప్పారు. మునుగోడు ప్రజలు తమ పార్టీ అభ్యర్థిని ఆదరిస్తా రన్న నమ్మకం ఉందన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్ని కల్లో కూడా తాము పూర్తిస్థాయిలో అభ్యర్థులను నిలబెడతామని ప్రకటించారు.