ఎమ్మెల్యే పదవికి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారు. ఆయన సమర్పించిన రాజీనామాను తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి సోమవారం ఆమోదించారు. ఉదయం అసెంబ్లీకి వెళ్లిన రాజగోపాల్ రెడ్డి తన రాజీనామాను ఎలాగైనా ఆమోదింపజేసుకుంటానని స్పష్టం చేశారు. ఈ క్రమంలో స్పీకర్ను కలిసి తన రాజీనామా లేఖను అందజేశారు. నిబంధనలకు అనుగుణంగా ఉండడంతో వెంటనే దానిని స్పీకర్ ఆమోదిస్తూ నిర్ణయం తీసుకున్నారు.