వైఎస్సార్టీపీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం తెలంగాణ గవర్నర్ తమిళిపైను కలవనున్నారు. సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్ వెళ్లనున్న షర్మిల.. రాష్ట్రంలో నీటి ప్రాజెక్టుల నిర్మాణంలో అవినీతి జరిగిందని ఫిర్యాదు చేయనున్నారు. గవర్నర్‌ను కలుస్తున్న దృష్ట్యా నేటి నుంచి ప్రారంభం కావాల్సిన పాదయాత్ర మంగళవారానికి వాయిదా పడింది. వికారాబాద్ జిల్లా కొడంగల్ నుంచి పాదయాత్ర ప్రారంభం కానుంది.