మేడ్చల్ జిల్లాలోని దుండిగల్ పోలీస్‌స్టేషన్ పరిధి మల్లంపేట్‌లో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. విద్యుత్ షాక్ తో 11 ఏళ్ల బాలుడితో పాటు మరో వ్యక్తి (30) మృతి చెందాడు. మల్లంపేట్ డ్రీమ్‌వ్యాలీ కాలనీలో నీటి సంపు శుభ్రం చేస్తుండగా ప్రమాదం జరిగింది. నీటి సంపులో ఎలక్ట్రిక్ సబ్ మెర్సిబుల్ మోటర్ మెయిన్ ఆఫ్ చేయకపోవడంతో విద్యుత్ ఘాతానికి బాలుడు భవానీ ప్రసాద్, సాఫ్ట్వేర్ ఇంజినీరు గాదె జానా రెడ్డి బలయ్యారు.