దేవరకద్ర నియోజకవర్గం దేవరకద్ర మండల పరిధిలోని నార్లోనికుంట మరియు బస్వపూర్ గ్రామాలకు కోయిల్ సాగర్ మెయిన్ రోడ్డు నుంచి నార్లోనికుంట గ్రామం వరకు దాదాపు 2 కిలోమీటర్ల వరకు బీట్ రోడ్డు నిర్మించాలని సోమవారం దేవరకద్ర శాసన సభ్యులు ఆల వెంకటేశ్వర్ రెడ్డి కు దేవరకద్ర ఎంపీపీ రమశ్రీకాంత్ యాదవ్ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచులు రామాంజనేయులు, హనుమంతు, బస్వపూర్ గ్రామల పార్టీ అధ్యక్షులు వివేక్ గౌడ్, నారాయణ చారి, మధుసూదన్ రెడ్డి, బి వెంకటయ్య, సత్యన, కురుమయ్య, రాజు, శ్రీను, అంజనేయులు, బాలయ్య, నర్సిములు, శ్రీను. గ్రామ నాయకులు, యువకులు ప్రజలు పాల్గొన్నారు.