బాల్య వివాహాల నివారణ కోసం ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలని భవానిపేట ఉప సర్పంచ్ ఆశన్న గారి రమేష్ గౌడ్ తెలిపారు. గ్రామ సచివాలయంలో బాల్య వివాహాలపై సోమవారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాల లోపు ఎవరు పెళ్లిళ్లు చేసుకోవద్దని సూచించారు. అటువంటివి ఏమైనా జరుగుతే గ్రామపంచాయతీ సిబ్బందికి తెలియ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్ డాక్టర్ శ్రీనివాస్, ప్రోగ్రామ్ ఆఫీసర్ బాలకిషన్, కరోబార్ నర్సింలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఆశా వర్కర్లు, పంచాయతీ సిబ్బంది పాల్గొన్నారు.