ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చిక్కడపల్లిలో భారీ అగ్నిప్రమాదం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 02, 2023, 11:03 AM

చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో అగ్నిప్రమాదం జరిగింది. వీఎస్ టీ లోని అన్నపూర్ణ బార్ సమీపంలో ఉన్న  ఓ గోదాంలో గురువారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. దట్టమైన పొగలతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. విషయం తెలియగానే చిక్కడపల్లి పోలీసులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. మరోవైపు ఫైర్ ఇంజన్లు కూడా ఘటనాస్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేస్తున్నారు.

డెకరేషన్ సామాను గోడౌన్ లో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. పక్కనే ఉన్న మరో రెండు గోడౌన్లకు కూడా మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజన్స్ తో పాటు వాటర్ ట్యాంకర్స్ తెప్పించి మంటలను అదుపు చేయడానికి ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. గోడౌన్స్ పాతవి కావడంతో పైకప్పు రేకులు కూలిపోతున్నాయి. పక్కన ఉన్న మరో ఎల్ ఈ డి లైట్స్ గౌడౌన్ లోకి మంటలు వ్యాపించకుండా ఫైర్ సిబ్బంది ఆర్పివేస్తున్నారు. ఎల్ ఈ డి లైట్స్ గోడౌన్ లోకి పాకితే మరింత ఎక్కువగా మంటలు వ్యాపించే అవకాశం ఉంది. ప్రమాదం ఎలా జరిగిందన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com