ఏకాగ్రత్తతో చదవి పరీక్షలకు సిద్ధమై తల్లిదండ్రుల కల సాకారం చేయాలని యువతకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పిలుపునిచ్చారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ మున్సిపాలిటీ లోని లాలా శ్రీ గార్డెన్లో ఇంద్రన్న మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎస్సై, కానిస్టేబుల్ మెయిన్స్ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులకు స్టడీ మెటీరియల్ ను విద్యా శాఖ మంత్రి పి సబితా ఇంద్రా రెడ్డి పంపిణీ చేశారు. ఇంద్రన్న మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థులకు ఉచిత శిక్షణ తో పాటు స్టడీ మెటీరియల్ అందించటం ఎంతో గొప్ప విషయం అని వారు కొనియాడారు. ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగం అనే కలను సాకారం చేసుకోవాలని, పుట్టిన ఊరు, తల్లిదండ్రుల పెరు నిలబెట్టాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఒకవైపు ఉద్యోగ నోటిఫికేషన్లు ఇస్తూనే పేద, మధ్య తరగతి, యువతి యువకులు కోచింగ్ సెంటర్ లకు వేల రూపాయలు ఖర్చు చేయకుండా పార్టీ తరుపున, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు, వివిధ స్టడీ సర్కిల్ ల ద్వారా ఉచిత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు ఏర్పాటు చేయించారన్నారు. బాగా చదివి ఏకాగ్రతతో పరీక్షలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.