TSPSC పేపర్ల లీకేజీ స్కాంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేసింది. ప్రవీణ్, రాజశేఖర్, రేణుకతో సహా 9మంది నిందితును అధికారులు నేడు ఉమ్మడిగా విచారించనున్నారు. వీరికోసం మెుత్తం 30 ప్రశ్నలతో కూడిన ప్రత్యేక ప్రశ్నావళిని సిద్ధం చేసింది. మరోవైపు నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్న సెల్‌ఫోన్, ల్యాప్‌టాప్, పెన్‌డ్రైవ్, TSPSC నుంచి సీజ్ చేసిన కంప్యూటర్లను ఫోరెన్సిక్ పరీక్షలకు పంపించారు.