తాండూరు పట్టణం లోని ప్రధాన రోడ్ల తో పాటు తాండూరులోకి వచ్చే ప్రధాన రోడ్డు మార్గాలను అభివృద్ధి చేసేందుకు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేస్తున్న కృషి ఫలించింది. ఇప్పటికే బస్టాండ్ నుంచి సెయింట్ మార్క్స్ పాఠశాల వరకు విస్తరించి అభివృద్ధి చేసిన రోడ్డుకు ఇరు వైపులా బిటీ రోడ్డు నుంచి వర్షపు నీటి డ్రైన్ వరకు బిటి రోడ్డు నిర్మాణంతో పాటు పట్టణ సుందరికరణకు రూ. 25 కోట్ల ను ప్రభుత్వం మంజూరు చేసిన విషయం తెలిసిందే. జీవో 217 ని ఆర్ అండ్ బి జారీ చేసింది. హైదరాబాద్ రోడ్డు మార్గంలోని ఖంజాపూర్ నుంచి విలియ మూన్ వరకు ఉన్న రోడ్డు ను అభివృద్ధి చేసి ఇరు వైపులా డ్రైన్ నిర్మాణం కు రూ. 5. 20 కోట్లు విడుదల చేసింది. అదేవిధంగా అంతారం రోడ్డు మార్గంలోని పాల కేంద్రం నుంచి అంతారం గ్రామం దాటిన తరువాత వచ్చే బైపాస్ రోడ్డు వరకు నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం కు ప్రభుత్వం రూ. 15 కోట్లు కేటాయించింది. ఎమ్మెల్యే విజ్ఞప్తి మేరకు ఆర్ అండ్ బి శాఖ జీవో 237 జారీ చేసింది. తాండూరు పట్టణంలోకి వచ్చే ప్రధాన రోడ్ల అభివృద్ధి కి నిధులు విడుదల చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్ కి, ఆర్ అండ్ బి శాఖ మంత్రి ప్రశాంత్ రెడ్డికి ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.
![]() |
![]() |