తెలంగాణ రాష్ట్రం ఎవరి భిక్ష కాదని, పోరాడి సాధించుకున్నామని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. తెలంగాణ పోరాటాలను కాంగ్రెస్ పార్టీ పదేపదే అవమానిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్ పార్టీ చేసిన కాలయాపన ఫలితంగానే తెలంగాణలో ఆత్మబలిదానాలు జరిగాయని విమర్శించారు. కాంగ్రెస్ చర్యలతో తెలంగాణ రెండు తరాల భవిష్యత్‌ను కోల్పోయిందని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్, బీజేపీలకు స్థానం లేదన్నారు.