పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో భాగంగా లోక్సభలో ప్రధాని చేసిన ప్రసంగంలో ఏపీ విభజన అంశాన్ని ప్రస్తావించగా మంత్రి కేటీఆర్ ప్రధాని వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. 'అడుగడుగునా దగా.. ప్రశ్నిస్తే పగ. డబుల్ ఇంజన్ నినాదంతో ఊదరగొట్టే మీకు.. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు కూడా రావు. డిపాజిట్లు పోగొట్టుకోవడంలో మీరు మళ్లీ సెంచరీ కొట్టడం పక్కా..!’’ అని కేటీఆర్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఎద్దేవా చేశారు.