చట్ట సభల్లో మహిళా రిజర్వేషన కోసం పోరాడుతున్న బీఆర్ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కవిత పోరాటం ఫలించనుంది. ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశ పెట్టే అవకాశం ఉంది. ఈ నెల 20వ తేదీన ఈ బిల్లుపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో ఈరోజు ప్రత్యేక సమావేశాలు ప్రారంభమైన విషయం తెలిసిందే. రేపటి నుంచి కొత్తగా నిర్మించిన భవనంలో ఈ సమావేశాలు జరుగనున్నాయి.