వికారాబాద్ పట్టణాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్లపల్లి మంజుల రమేష్ అన్నారు. సోమవారం వికారాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని 28వ వార్డు పాత పోలీస్ స్టేషన్ సమీపంలో 10 లక్షల నిధులతో చేపట్టనున్న సిసి రోడ్డు నిర్మాణ పనులను స్థానిక కౌన్సిలర్ మోముల స్వాతి రాజ్ కుమార్ తో కలిసి ప్రారంభించారు.