పార్లమెంట్లో మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుకు బీఆర్ఎస్ ప్రభుత్వం మద్దతు ఇస్తుందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కేబినెట్ ఆమోదం తెలపడాన్ని స్వాగతిస్తున్నాం.కనీసం ఇప్పుడైనా మోదీ ప్రభుత్వం బిల్లు పెడుతున్నందుకు సంతోషంగా ఉంది. కేంద్రం పారదర్శకంగా ఉండాలి, దీనిని దాయల్సిన అవసరం లేదు. కేంద్ర కేబినెట్ ఒక మంచి నిర్ణయం తీసుకుంది. అధికారంలో సగం కావాలన్న మహిళల కల సాకారం కాబోతుంది. మహిళలందరికీ శుభాకాంక్షలు తెలియజేసారు.