ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఎల్బీనగర్ లో రోడ్డు ప్రమాదం, పలువురికి గాయాలు

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 03:43 PM

హైదరాబాద్ నగరంలోని ఎల్బీనగర్ మెట్రో స్టేషన్ కింద అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. ఎల్బీనగర్ నుంచి విజయవాడ హైవే రూట్‌లో వెళ్తున్న షిఫ్ట్ డిజైర్‌కు ప్రమాదం వాటిల్లింది. అత్యంత వేగంగా దూసుకెళ్లడంతో కారు టైర్ ఒక్కసారిగా బ్లాస్ట్ అయ్యింది. దీంతో కారు పల్టీలు కొట్టింది. కారులో ఉన్న ముగ్గురు యువకులకు గాయాలయ్యాయి. కారు బోల్తా పడటంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. స్థానికులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com