జలవిహార్ పక్కన దాదాపు 10 ఎకరాల్లో లేక్ ఫ్రంట్ పార్క్ ను హెచ్ఎండీఏ అభివృద్ధి చేసింది. ఈ లేక్ ఫ్రంట్ పార్క్ గురించి వివరిస్తూ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా మంత్రి కేటీఆర్ ఓ వీడియో పోస్ట్ చేశారు. త్వరలో ఈ పార్కును ప్రారంభించబోతున్నట్లు కూడా తెలిపారు. అందమైన బోర్డు వాక్ ను సందర్శించి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నానని అన్నారు. కాగా ఈ పార్కును హెచ్ఎండీఏ సుమార్ రూ.15 కోట్ల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.