సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలం ఆకుల లింగాపూర్ గ్రామానికి చెందిన నిరుపేద అనాధ బాలిక నీరుడు విజయలక్ష్మిని ఆదుకుంటామని మంత్రి హరీష్ రావు భరోసా ఇచ్చారు. వివిధ పత్రికల్లో వచ్చిన కథనాలను చూసి హరీష్ రావు తన ఇంటికి పిలిపించుకొని విజయలక్ష్మి వైద్య విద్య (ఎంబిబిఎస్) పూర్తయ్యేంతవరకు అన్ని విధాల ఆదుకుంటామని మంగళవారం మంత్రి హామీ ఇచ్చారు. విజయలక్ష్మి ఉన్నత లక్ష్యం ముందు పేదరికం ఓడిపోయిందని మంత్రి ఆమెను అభినందించారు.