మహిళా బిల్లుకు కేంద్ర కేబినేట్ ఆమోదం తెలపడం ఆనందమైన విషయంగా వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా పేర్కొన్నారు. జనాభాలో సగభాగమైన మహిళలు సమాన హక్కు పొందే రోజు కోసం ఎదురుచూస్తున్నానన్నారు. ఈ ఎన్నికల సమయంలో ఈ బిల్లు ప్రవేశ పెట్టడంపై ప్రజల్లో అనుమానాలున్నాయన్నారు. రాజకీయ అవకాశవాదం కోసం కాకుండా ప్రజా శ్రేయస్సు కోసం పని చేయాలని షర్మిల అన్నారు. ఈ బిల్లు ప్రవేశపెట్టడానికి మోదీ ప్రభుత్వం ఇంత సమయం తీసుకోవడం బాధాకరమన్నారు. బిల్లు ఆమోదంలో రాజకీయ పార్టీలకు, రాజకీయ నాయకులకు ఈ బిల్లును రాజకీయ అవకాశవాదంగా ఉపయోగించవద్దని షర్మిల సూచించారు.