ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి బీఆర్ఎస్, కాంగ్రెస్ , బీజేపీపై నిప్పులు చెరిగారు. మెదక్‌లో ప్రజాశాంతి పార్టీ జిల్లా కార్యాలయం ప్రారంభం సందర్భంగా ఆయన మాట్లాడుతూ..... 70 ఏళ్ల కాంగ్రెస్ పాలన అవినీతిమయమని అన్నారు. రూ.3800 కోట్లు పెట్టి హైదరాబాద్‌లో కాంగ్రెస్ మీటింగ్ పెట్టిందని పాల్ ఆరోపించారు. ‘‘తెలంగాణకు మంచిరోజులు వచ్చాయి. గద్దర్ చనిపోయేముందు ప్రజా శాంతి పార్టీ గెలిపించాలని కోరారు. ప్రజలకు శాంతి కావాలంటే ప్రజా శాంతి పార్టీ రావాలి. బీఆర్ఎస్ భూస్థాపితం కావాలని గద్దర్ కోరుకున్నారు. ప్రజశాంతి ప్రభుత్వం ఏర్పాటైతే రూ.6 లక్షల కోట్ల అప్పు తీర్చేస్తా. కేసీఆర్ ముక్త్ తెలంగాణ, కాంగ్రెస్ ముక్త్ తెలంగాణ, బీజేపీ ముక్త్ తెలంగాణ కోరుకుంటున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 10 టికెట్లు జర్నలిస్టులకు ఇస్తా. మోదీకి ఇవి లాస్ట్ ఎన్నికలు. ఈవీఎంలు వద్దు. బ్యాలెట్లు కావాలని సుప్రీం కోర్టులో అప్పీల్ చేస్తున్నాను. ఎంఐఎంకు చెందిన 7 నియోజకవర్గాలు తప్ప అన్ని నియోజకవర్గాల్లో పోటీచేస్తాం అని తెలియజేసారు.