ట్రెండింగ్
Epaper    English    தமிழ்

హైదరాబాద్‌ నగరంలో సిద్ధమైన మరో టూరిస్ట్ ప్లేస్,,,,త్వరలో లేక్ ఫ్రంట్ పార్కు ప్రారంభం

Telangana Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 07:53 PM

హైదరాబాద్‌లో ప్రముఖ పర్యాటక కేంద్రం హుస్సేన్ సాగర్. నగరానికి వచ్చే టూరిస్టులు తమ విజిటింగ్ ప్లేసెస్ లిస్ట్‌లో ఈ భారీ సరస్సును తప్పనిసరిగా చేర్చుకుంటారు. దీంతో సాగర్ అందాలను మరింత పెంచేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. హుస్సేన్ సాగర్ చుట్టూ టూరిస్ట్ సర్క్యూట్‌గా చేయడం కోసం హెచ్‌ఎండీఏ ప్రత్యేక చర్యలు తీసుకుంటుంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్ చుట్టూ ఆకట్టుకునే నిర్మాణాలు, పార్కులతో జనసందడి నెలకొంటుంది.


అమరవీరుల స్థూపం, కొత్త సెక్రటేరియట్, భారీ అంబేద్కర్ విగ్రహంతో సాగర్ అందాలు అలరారుతున్నాయి. వీటికి మరొక స్పెషల్ అట్రాక్షన్ యాడ్ కాబోతుంది. జలవిహార్ పక్కన దాదాపు 10 ఎకరాల్లో హైదరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ లేక్ ఫ్రంట్ పార్క్‌ను అభివృద్ధి చేసింది. మరికొద్ది రోజుల్లో పార్కును ప్రారంభించనున్నారు. ఈ మేరకు మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. సాగర్‌కు సరికొత్త అందం చేరుబోతుందని అన్నారు. నగరప్రజలు అందమైన బోర్డ్‌వాక్‌ని సందర్శించి ఆనందిస్తారని ఆశిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు.


15 కోట్ల అంచనా వ్యయంతో దరాబాద్ మహానగరాభివృద్ధి సంస్థ 10 ఎకరాల విస్తీర్ణంలో ఈ పార్కును ఏర్పాటు చేసింది. పార్కులో అండర్‌పాస్‌లతో కూడిన ఎత్తైన నడక మార్గాలు, కాలినడక దారులు, సీటింగ్‌తో కూడిన వాటర్ ఛానల్ డెక్, హుస్సేన్ సాగర్‌పై విస్తరించి ఉన్న గ్లాస్ డెక్, లేక్‌ఫ్రంట్ పార్క్ కోసం వేవ్ లాంటి కర్విలినియర్ డిజైన్‌లు ఏర్పాటు చేశారు. పార్కులో ఆకట్టుకునేలా ఏర్పాటు చేసిన లైటింగ్ అదనపు ఆకర్షణ. పార్కులో పిల్లల కోసం ఆట స్థలం, సీటింగ్‌తో కూడిన పెర్గోలాస్ ఏర్పాటు చేశారు. ముంబైకి చెందిన ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్ కిషోర్ డి ప్రదాన్‌ ఈ పార్క్ అభివృద్ధి, సుందరీకరణ పనులు చేపట్టారు.










SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com