నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో గురువారానికి మొత్తం 2 లక్షల 33 వేల 565 మంది ఓటర్లు ఉన్నారు. 265 పోలింగ్ బూత్ లు ఉన్నాయి. పురుషులు 117124, మహిళలు 116439, ఇతరులు 2 ఉన్నారు. భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి డాక్టర్ గువ్వల బాలరాజు, కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ వంశీకృష్ణ, బిజెపి నుంచి సతీష్ మాదిగ పోటీ చేస్తున్నారు. బిఎస్పి, ధర్మ సమాజ్ పార్టీ పోటీలో ఉన్నాయి.