గద్వాల: బీజేపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సంఘాల అయ్యపు రెడ్డి గురువారం ఉదయం ఏడున్నర గంటలకు తన ఓటు హక్కును సంఘాల గ్రామంలో వినియోగించుకున్నారు. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం ఏడు గంటలకు ప్రారంభం కాగానే అయ్యపు రెడ్డి తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటును వినియోగించుకున్నారు. ఓటు హక్కును ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని బీజేపీ రాష్ట్ర నాయకులు అయ్యపు రెడ్డి ఓటర్లను విజ్ఞప్తి చేశారు.