కామారెడ్డి జిల్లా పెద్ద కొడప్గల్ మండలం కాటేపల్లి గ్రామ శివారులో చిరుత పులి సంచారం కలకలం రేపుతోంది. బుధవారం కాటే పల్లి తాండా కు చెందిన శ్రీను నాయక్ తన గొర్రెలను మేత కోసం గ్రామ శివారు అటవీ ప్రాంతం లోని నల్ల గుండ్ల చెక్ డ్యాం వద్దకు తీసుకవెళ్ళాడు. అకస్మాత్తుగా గొర్రెల మంద పై దాడికి దిగిన చిరుత ఒక గొర్రెను నోట కరుచుకుని ఎత్తుకెళ్ళిందని గొర్రెల కాపరి శ్రీను ఆవేదన వ్యక్తం చేశారు.