ఎన్నికల నియమావళి ఉల్లంఘించి శాంతి భద్రతలకు విఘాతం కలిగించి, అల్లర్లకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రామగుండం సీపీ రెమా రాజేశ్వరి హెచ్చరించారు ప్రజలు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా తమ ఓటు హక్కును స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలన్నారు. ప్రశాంతంగా ఎన్నికల నిర్వహణకు అన్ని భద్రత ఏర్పాట్లు చేశామని వివరించారు.