ఎన్నికల్లో ఓటు వేసేందుకు పోలింగ్ కేంద్రానికి వెళ్లే సరికే.. మీ ఓటు వేరేవారు వేసేశారా? అయితే ఈ విషయంలో దిగులు పడాల్సిన అవసరం లేదు. మీకు టెండర్ ఓటు వేసే హక్కును ఈసీ కల్పించింది. ఈవీఎం ద్వారా కాకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఓటేసే అవకాశం కల్పిస్తారు. ఓటరు బ్యాలెట్ పత్రంలో.. ఓటెయదలచిన అభ్యర్థికి చెందిన ఎన్నికల గుర్తుపై స్వస్తిక్ ముద్రను వేయాల్సి ఉంటుంది.
వచ్చే ఐదేళ్లకు తెలంగాణ ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ మొదలైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూకడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 7.78శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.