తెలంగాణలో 13 వామపక్ష ప్రభావిత ప్రాంతాల్లోని నియోజకవర్గాల్లో ఇవాళ ఉ. 7 గంటల నుంచి సా. 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. మిగిలిన 106 నియోజకవర్గాల్లో ఉ. 7 గంటల నుంచి సా. 5 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు. పోలింగ్ సమయం ముగిసిన తర్వాత కూడా పోలింగ్ కేంద్రం ముందు క్యూలో నిలబడిన వారికి ఓటేసేందుకు అవకాశం కల్పిస్తారు. పోలింగ్ సమయం ముగిసిన వెంటనే లైనులో ఉన్న ఓటర్లకు పోలింగ్ అధికారులు టోకెన్లు ఇస్తారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు పోలింగ్ మొదలైంది. తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు క్యూకడుతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 7.78శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.