అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు ఉన్న ప్రతి ఒక్కరూ తమ హక్కును వినియోగించుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్ విజ్ఞప్తిచేశారు. ఓటు వేయడం ఓటరు బాధ్యత అని, ప్రజాస్వామ్యంలో ఓటు ఎంతో విలువైనదని చెప్పారు. ఓటింగ్ డే-హాలిడే కాదనే విషయాన్ని గుర్తించాలని అన్నారు. ఇవాళ ఉదయం ఆయన హైదరాబాద్ సనత్‌నగర్‌లో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు.
అయితే వచ్చే ఐదేళ్లకు తెలంగాణ ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 7.78శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు.