తెలంగాణ రాష్ట్రంలో ఓటింగ్ ప్రశాంతంగా కొనసాగుతోందని రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ తెలిపారు. 'కొన్ని చోట్ల ఈవీఎంలలో ఇబ్బందులు వచ్చాయి. వాటిని సరిదిద్దుతున్నాం. కొత్త ఓటర్లు, యువత ఓటు వేయడానికి తరలిరావాలి. బూత్ ఎక్కడున్నది యాప్లో తెలుసుకోవచ్చు. లొకేషన్తో పాటు వివరాలు వస్తాయి. ఇప్పటికే ఓటింగ్పై అవగాహన కల్పించాం. ఈ సారి ఓటింగ్ పర్సెంటేజ్ పెరుగుతుంది' అని వికాస్ రాజ్ తెలిపారు.
అయితే వచ్చే ఐదేళ్లకు తెలంగాణ ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 7.78శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.