తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం నుంచి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ.. "అవినీతి రహిత, పేదల అనుకూల ప్రభుత్వం మాత్రమే తెలంగాణ సంక్షేమం కోసం నిస్వార్థంగా పని చేస్తుందని, ప్రజల సాధికారత లక్ష్యంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలిరావాలని షా తెలంగాణ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
అయితే వచ్చే ఐదేళ్లకు తెలంగాణ ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 7.78శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.