ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందన్నారు. కొండాపూర్ చీరక్ పబ్లిక్ స్కూల్ 375 పోలింగ్ బూత్ లో కుటుంబ సభ్యులతో కలిసి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు వజ్రాయుధం లాంటిదన్నారు. ఓటు హక్కు మన భవిష్యత్తు మన చేతుల్లోనే ఉందని తెలియజేస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా యువత, విద్యావంతులు తమ బాధ్యతగా భావించి ఓటు వేసి పోలింగ్‌లో పాల్గొనాలన్నారు.
అయితే వచ్చే ఐదేళ్లకు తెలంగాణ ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 7.78శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.