తెలంగాణ పౌరుడిగా తన బాధ్యతను నెరవేర్చానని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఓటు ఉన్న పౌరులంతా ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. బంజారాహిల్స్‌లోని నందినగర్‌లో ఓటు వేసిన తర్వాత కేటీఆర్ మాట్లాడుతూ.. ‘ప్రజాస్వామ్యంలో ఇది పెద్ద పండుగ. నగర, పట్టణ ప్రాంతాల్లో ఓటర్లు పూర్తిస్థాయిలో ఓటింగ్‌కు రావడం లేదు. విద్యావంతులంతా తమ బాధ్యతను నిర్వర్తించాలి. నా రాష్ట్రాన్ని ప్రగతిపథంలో ముందుకు తీసుకెళ్లే పార్టీకి ఓటు వేశాను’ అని చెప్పారు.
అయితే వచ్చే ఐదేళ్లకు తెలంగాణ ఓటర్లు తమ ప్రతినిధులను ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ఉదయం 7 గంటలకు ప్రారంభమైంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 9 గంటల వరకు 7.78శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని మొత్తం 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్ పోటీ చేస్తోంది. కాంగ్రెస్ (118) కూటమిలో సీపీఐ 111 స్థానాల్లో, బీజేపీ 111 స్థానాల్లో, జనసేన 8 స్థానాల్లో, సీపీఎం 19 స్థానాల్లో, బీఎస్పీ 107 స్థానాల్లో పోటీ చేస్తున్నాయి.